ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.370 అధికరణను రద్దు చేయడాన్ని సుప్రీం సమర్థించిందని తెలిపారు.
ద్వంద్వ ప్రమాణాలకు బీజేపీ వ్యతిరేకమని పురంధేశ్వరి పేర్కొన్నారు.ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిత్రాలు, రెండు జెండాలు వంటి వాటిని బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.







