యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2011 సంవత్సరం మే నెల 5వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు.ఈ వివాహానికి 10,000 కంటే ఎక్కువమంది హాజరు కాగా అంగరంగవైభవంగా జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు అనే తెలిసిందే.ఎన్టీఆర్ కొడుకు పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కాగా కొడుకు పేర్లలో రామ్ అనే పదం ఉండటానికి సంబంధించి ఎన్టీఆర్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఎన్టీఆర్ తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మాట్లాడుతూ నా పుట్టినరోజును షేర్ చేసుకునే ఫ్రెండ్ మనోజ్ అని మేమిద్దరం ఒకటే రోజు పుట్టామని ఎన్టీఆర్ వెల్లడించారు.చాలామంది తన కొడుకు పేరు అభయ్ రామ్ కాగా అభిరామ్ అని పిలుస్తూ ఉంటారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
ఎవరైనా అలా పిలిస్తే తాను వెంటనే కరెక్ట్ చేస్తూ ఉంటానని తారక్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తెలిపారు.
మా నాన్నగారు కొడుకులకు జానకిరామ్, కళ్యాణ్ రామ్ అని తనకు తారక్ రామ్ అని పెట్టారని నాన్నకు రాముడి పేర్లు అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ తెలిపారు.
ఆ రీజన్ వల్లే కళ్యాణ్ రామ్ కొడుకుకు శౌర్యారామ్ అని పేరు పెట్టగా తాను తన ఇద్దరు కొడుకులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని పేర్లు పెట్టానని ఎన్టీఆర్ తెలిపారు.తన ఫ్యామిలీ నేమ్స్ గురించి ఎవరికీ తెలియని విషయాలను యంగ్ టైగర్ తెలిపారు.
చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 20 ఏళ్లకే స్టార్ హీరో స్టేటస్ ను అందుకోవడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీతో తన రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకోవాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు.