అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.బన్నీ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.
బన్నీ గత సినిమా అల వైకుంఠపురములో ఎంత పెద్ద హిట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే అల్లు అర్జున్ తన సినిమాల ద్వారా పరిచయం చేసిన హీరోయిన్లు మాత్రం కెరీర్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
బన్నీ తొలి సినిమా గంగోత్రిలో అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.గంగోత్రి సక్సెస్ బన్నీకి ఉపయోగపడినా అది అగర్వాల్ మాత్రం కెరీర్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలను సొంతం చేసుకోలేకపోయారు.
బన్నీ రెండో సినిమా ఆర్యలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించారు.బన్నీ సక్సెస్ సాధించినా అనురాధ మెహతా కెరీర్ కు ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు.
వినాయక్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “బన్నీ” మూవీలో గౌరీ ముంజుల్ హీరోయిన్ గా నటించారు.

అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ భారీగా అవకాశాలను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు.బన్నీ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దేశముదురు సినిమాతో హన్సిక టాలీవుడ్ కు పరిచయమయ్యారు.అయితే హన్సిక మాత్రం బాగానే గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అయితే ఈ బ్యూటీ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేదు.

బన్నీ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి భాను శ్రీ మెహ్రా పరిచయమయ్యారు.ఈ హీరోయిన్ కు వరుడు మూవీ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదనే సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ హీరోగా హిట్ అయినా ఆయన సినిమాలతో పరిచయమైన హీరోయిన్లకు మాత్రం వరుస షాకులు తగిలాయి.