Manchu Lakshmi : అక్కడ టాటూ వేయించుకున్న మంచు లక్ష్మి.. టాటూ మీనింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ నటి మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి( Manchu Lakshmi ) గురించి మనందరికీ తెలిసిందే.మంచు లక్ష్మి తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 Actress Manchu Lakshmi Getting Tattooed At Her Body Photos Has Gone Viral-TeluguStop.com

మంచు ఫ్యామిలీలో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలిచే వారిలో మంచు లక్ష్మి ముందు ఉంటుంది అని చెప్పవచ్చు.ఈమె సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు పలు పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల ఈ ముద్దుగుమ్మ వేయించుకున్న ఒక టాటూ( Tattoo ) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.కాగా మంచు లక్ష్మీ తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె సంప్రదాయ పద్దతిలో హుందాగా చీర కట్టుకొని బాహుబలి సినిమాలో శివగామి తరహాలో ఫోటోలకు పోజులిచ్చింది.అయితే విచిత్రం ఏమిటంటే ఈ ఫోటోలకు ముందు షేర్ చేసిన పిక్స్ లో మాత్రం వీపుపై ఇంగ్లీష్ లెటర్స్ ని టాటూగా వేయించుకుంది.వాట్ యు సీ సీకింగ్ యూ ( What You See Seeking You )అని రాయించుకోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఏదో సందేశం ఇవ్వాలని ట్రై చేసిన మంచు లక్ష్మి తన జబ్బపై ఈ అక్షరాలు పచ్చబొట్టుగా వేయించుకోవడం ఏమిటని సెటైర్లు వేస్తున్నారు.ఒళ్లు చూపించడానికే ఈ స్టంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.అయితే కొందరు ఆ టాటూ పై పాజిటివ్ గా స్పందిస్తున్నగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం ఆ టాటూకి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube