ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు మలైకా అరోరా, అర్జున్ కపూర్( Arjun kapoor ).ప్రస్తుతం ఈ జంట వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి ఎన్నో రకాల వార్తను సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా గతంలో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు మీడియాలో జోరుగా వినిపించాయి.
అయితే ఆ వార్తలన్నీ తప్పుడు ప్రచారమని పలుమార్లు నిరూపించారు.అయితే తాజాగా వారిద్దరూ విడిపోయారనే విషయం బాలీవుడ్ మీడియాలో వైరల్ అయింది.
అందుకు కారణం మలైకా అరోరా( Malaika arora ) పెట్టిన పోస్టు అనేక అనుమానాలకు తావివిచ్చింది.
కాగా మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్( Arbaaz Khan )తో విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్‌కు దగ్గరైన విషయం తెలిసిందే.వారిద్దరూ కలిసి 2017లో తొలిసారి లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడంతో వారి డేటింగ్ వ్యవహారం బయటపడింది.ఇక మలైకా 45వ బర్త్ డే సందర్భంగా వారిద్దరూ ఇటలీలో విహారయాత్ర చేయడంతో అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారానికి అధికారిక ముద్ర పడింది.2017 సంవత్సరం నుంచి మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరూ పలుమార్లు వెకేషన్స్‌కు వెళ్లడం, అలాగే వారిద్దరూ ప్రేమ పక్షుల్లా తిరుగుతూ మీడియాలో హైలెట్ అవుతూ వస్తున్నారు.
అయితే గతంలో వారిద్దరూ విడిపోయారని అనేక మార్లు రూమర్లు వచ్చాయి.కానీ ఆ వార్తలన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.అయితే తాజాగా మరోసారి అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారనే వార్తలు వినిపిస్తుండగా ఇంస్టాగ్రామ్ లో పోస్టు వైరల్ అయింది.
గుడ్ మార్నింగ్.మార్పు అనేది జీవితంలో ఒక సూత్రం.
గతాన్ని, ప్రస్తుతాన్ని చూసే వారు ఫ్యూచర్‌ను మిస్ అవుతారు అంటూ నర్మగర్భంగా పోస్టు పెట్టింది.దాంతో ఆ పోస్టు వైరల్ కావడంతో అర్జున్ కపూర్‌తో రిలేషన్ బ్రేక్ అయిందన్న వార్తలు మరోసారి జోరుగా విడిపిస్తున్నాయి.
ఈ వార్తలపై అటు మలైకా కానీ ఇటు అర్జున్ కపూర్ కానీ స్పందించడం లేదు.