మొటిమల తాలూకు మచ్చలను వారం రోజుల్లో మాయం చేసే మిరాకిల్ టిప్స్ ఇవి.. డోంట్ మిస్!

మొటిమలు( pimples ).అత్యంత సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

 Miracle Tips To Get Rid Of Acne Marks! Miracle Tips, Acne Marks, Ance, Pimples,-TeluguStop.com

అయితే కొందరికి మొటిమలు తగ్గిపోయినా వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి.ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తాయి.

ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేసి విసిగిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ టిప్స్ అద్భుతంగా సహాయపడతాయి.వీటిని పాటిస్తే వారం రోజుల్లో మొటిమలు తాలూకు మచ్చలకు బై బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు లేటు ఆ మిరాకిల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne, Ance, Tips, Clear Skin, Latest, Miracle Tips, Pimples, Skin Care, S

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్ వే( Orange peel powder )సుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్( Potato juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే మొటిమల తాలూకు మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

ముఖ చర్మం కాంతివంతంగా సైతం మారుతుంది.

Telugu Acne, Ance, Tips, Clear Skin, Latest, Miracle Tips, Pimples, Skin Care, S

అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క, ( Ginger )మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు రెబ్బలు వేపాకు మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను దూది సహాయంతో ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు రెండు సార్లు కనుక చేస్తే మొటిమల తాలూకు మచ్చలే కాదు ఎలాంటి మచ్చలు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.

క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

ఇక ఆముదంతో కూడా మచ్చలు నివారించుకోవచ్చు.

అందుకోసం ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ టిప్ ను పాటించినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

మొటిమల తాలూకు మచ్చలు మాయం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube