యంగ్ హీరో శర్వానంద్ చాలా చిన్న వయసులోనే నటుడిగా వెండి తెరపై సందడి చేశాడు.చిన్న వయసులోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడంతో శర్వానంద్ కు మంచి గుర్తింపు లభించింది.
ఆ గుర్తింపును సద్వినియోగం చేసుకుంటూ హీరో శర్వానంద్ మెల్ల మెల్లగా కెరియర్ను బిల్డ్ చేసుకుంటూ ఎదిగాడు.నటుడిగా ఎంతో స్థాయికి ఎదిగిన శర్వానంద్ కథల ఎంపిక విషయంలో ఎంతో మంది ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచాడు అనడంలో సందేహం లేదు.
కెరీర్ ఆరంభంలో ఆయన చేసిన సినిమాలు మరియు పాత్రలు ఆయన స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచాయి.తెలుగు మరియు తమిళ సినిమాలు వరుస పెట్టి చేసిన శర్వానంద్ యంగ్ స్టార్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఎంతో కష్టపడి సొంతం చేసుకున్న ఆ పేరును తనకు తానే మెల్ల మెల్లగా తగ్గించుకుంటున్నారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఆయన ఒక కమర్షియల్ సూపర్ హిట్ ని కూడా దక్కించుకోలేక పోయాడు.
దాంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన నుండి కమర్షియల్ బ్లాక్ బస్టర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.తాజాగా వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కచ్చితంగా కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా ఆ సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది అంటూ రిపోర్ట్ వస్తున్నాయి.

కొన్ని ఏరియాల్లో పాజిటివ్ గా వసూళ్లు నమోదు అవుతున్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమాకు అభిమానులు సంతృప్తి చెందడం లేదు.శర్వానంద్ నుండి ఇలాంటి సినిమాలను ఆశించడం లేదని ఒక మంచి కమర్షియల్ హిట్ సినిమాలను ఆశిస్తున్నాం అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.నేడు శర్వానంద్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా అభిమానుల నుండి ఆయనకు ఒక విజ్ఞప్తి అందుతోంది.అది ఏంటి అంటే.
ఇకపై చేసే సినిమాలైనా కాస్త జాగ్రత్తగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో.కమర్షియల్ హిట్ కొట్టే విధంగా చేయాలని, కొత్త కథలను ఎంపిక చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక పైన శర్వానంద్ అలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.హ్యాపీ బర్త్ డే శర్వానంద్.