ఇటీవల టెక్నాలజీ( Technology ) అనేది విపరీతంగా పెరిగిపోయింది.రోజుకో కొత్త ఎలక్ట్రానిక్ పరికరం మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది.
వీటి వల్ల మానవ జీవితంలో ఎన్నో మార్పులు రావడంతో పాటు చాలా పనులు సులువవుతున్నాయి.ముఖ్యంగా ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
స్మార్ట్‌ఫోన్లు ప్రతిఒక్కరి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఏ పనైనా సులువుగా పూర్తి అవుతుంది.
అయితే స్మార్ట్‌ఫోన్లతో( Smartphone ) చాలామంది ఫొటోలు తీసుకుంటూ ఉంటారు.
కానీ స్మార్ట్‌ఫోన్ల రిజల్యూషన్ కొంతవరకు మాత్రమే ఉంటుంది.ఎక్కువ దూరంలోని ఫొటోలను తీయలేము.
తీసినా అవి స్పష్టంగా కనిపించవు.కానీ తాజాగా స్మార్ట్‌ఫోన్ టెలీస్కోప్( Smartphone Telescope ) అందుబాటులోకి వచ్చింది.
హిస్టియా లెన్స్ పేరుతో ఇవి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి.ఈ టెలిస్కోపిక్ లెన్స్ ను మన స్మార్ట్ ఫోన్ కెమెరాకు అమర్చుకుంటే ఎంతదూరంగా ఉన్నదానినైనా క్లియర్ గా ఫొటో తీయవచ్చు.
ఆకాశాన్ని, గ్రహాలను, నక్షత్రాలను కూడా ఫొటో తీయవచ్చు.
వావోనిస్( Vaonis ) అనేక అమెరికన్ కంపెనీ దీనిని ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసింది.ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టెలిస్కోపిక్ లెన్స్ ను( Telescopic Lens ) తయారుచేసింది.ఈ లెన్స్ ధర 289 డాలర్లుగా ఉంది.అంటే ఇండియన్ కరెన్సీలో రూ.23,702గా ఉంది.ఈ లెన్స్ చాలా ఎక్కువ రిజల్యూషన్ కలిగి ఉంటాయని, ఎంత దూరంలో ఉన్న దానినైనా ఫొటో తీయవచ్చని చెబుతున్నారు.ఆకాశంలో సదూరాన కనిపించే నక్షత్రాలను క్లియర్ గా ఫొటో తీయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
దీంతో ఇప్పుడు ఈ కెమెరా లెన్స్‌ను ఎక్కువమంది కొంటున్నారు.కొంతమందికి ఫొటోగ్రఫీ అంటే బాగా ఇష్టం ఉంటుంది.అలాంటివారికి ఈ కెమెరా మరింత ఉపయోగపడనుంది.మంచి హైక్వాలిటీతో ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా దీని ద్వారా ఫొటో తీయవచ్చు.రానున్న రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.