ఏ సమయంలో దీపారాధన చేయాలో తెలుసా?

ఏ సమయంలో దీపారాధన చేయాలో తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తప్పకుండా దీపారాధన చేస్తూ ఉంటారు.

ఏ సమయంలో దీపారాధన చేయాలో తెలుసా?

అయితే దీపారాధన ఎప్పుడూ కూడా ఒకే సమయంలో చేయటానికి వీలు కాకపోయినప్పటికీ కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తుంటారు.

ఏ సమయంలో దీపారాధన చేయాలో తెలుసా?

అంతేకాకుండా పవిత్రమైన కార్తీకమాసం మొదలవడంతో భక్తులందరూ ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం దీపాలను వెలిగించడం ద్వారా శుభం కలుగుతుందని భావిస్తారు.

కొందరు ఈ నెలంతా దీపారాధన చేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో వెలిగించాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

దీపం ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంది అంటారు.పంచభూతాల కలియకనే దీపంగా భావిస్తారు.

ఇంతటి పవిత్రమైన దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వపాపాలు నశించి పోయి, శుభం కలుగుతుంది.

ఎల్లప్పుడు ఏ ఇంటిలో అయితే దీపారాధన చేసి ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీ దేవత కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీపారాధన చేయని ఇల్లును జీవంలేని ఇంటిగా పరిగణిస్తారు.ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రపరచుకుని దీపారాధన చేయడం వల్ల రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది.

ప్రతిరోజు సరైన సమయంలో దీపాన్ని వెలిగించినప్పుడు మాత్రమే ఆ దీపానికి అర్థం పరమార్థం ఏర్పడుతుంది.

ప్రతిరోజు ఉదయం దీపారాధన సూర్యోదయం కాక ముందు నుంచి 10 గంటల వరకు పూజ చేసి దీపాలను వెలిగించవచ్చు.

ఈ సమయములో దీపాలను వెలిగించడానికి వీలుకానివారు మనసులో ఇష్టదైవాన్ని వేడుకోవడం ద్వారా శుభం కలుగుతుంది.

అలాగే సాయంత్రం కూడా ఇంటిని శుభ్రపరచుకుని, 5 గంటల సమయం నుంచి ఆరుగంటల సమయం లోపు దీపాలను వెలిగించాలి.

ఈ సమయంలో దీపాలను వెలిగించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.కార్తీకమాసంలో వెలిగించే దీపాలను కూడా ఇదే సమయంలో వెలిగించడం ద్వారా ఆ పరమశివుని అనుగ్రహం మనపై కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

అంబుడ్స్‌మన్‌ను తొలగించిన ట్రంప్ .. హెచ్ 1 బీ వీసాదారులు , విద్యార్ధులపై ఎఫెక్ట్

అంబుడ్స్‌మన్‌ను తొలగించిన ట్రంప్ .. హెచ్ 1 బీ వీసాదారులు , విద్యార్ధులపై ఎఫెక్ట్