ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా హృతిక్.. ఈ హీరో ఆస్తులు ఎంతంటే?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ( Bollywood star hero Hrithik Roshan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.

 Hrithik Roshan Birthday Special Know Bollywood Actor Net Worth And Car Collectio-TeluguStop.com

అలాగే పలు కమర్షియల్ యాడ్స్ చేసి భారీగానే సంపాదించారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హృతిక్ రోషన్ కహో నా ప్యార్ హై ( Kaho na pyaar hai )అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Assets, Bollywood, Car, Hrithik Roshan, Hrithikroshan, Net Worth-Movie

ఇకపోతే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న హృతిక్ రోషన్ ఒక్కో సినిమాకి 75 నుంచి 100 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటాడని సమాచారం.హృతిక్ రోషన్ కూడా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.ఇందుకోసం అతనికి 12 కోట్ల రూపాయలు అందుతాయి.ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక పోస్ట్‌ ను షేర్ చేసినందుకు వారికి 4 కోట్ల రూపాయలు లభిస్తాయి.హృతిక్ HRX అనే బ్రాండ్‌ను కలిగి ఉన్నాడు.దీని ద్వారా బూట్లు, షర్టులతో సహా అనేక క్రీడా వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

ఈ కంపెనీ విలువ 200 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

Telugu Assets, Bollywood, Car, Hrithik Roshan, Hrithikroshan, Net Worth-Movie

హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్‌ లో పెట్టుబడులు పెట్టారు.ముంబై లోని జుహులో అతనికి డూప్లెక్స్ హౌస్ ఉంది.దీని ధర 100 కోట్ల రూపాయలు.

ఇందులో 70 కోట్ల రూపాయలతో కూడిన పెంట్‌ హౌస్ కూడా ఉంది.అంతేకాకుండా జుహులో చాలా చోట్ల హృతిక్ కు స్థలాలు కూడా ఉన్నాయి.

అంతేకాదు లోనోవాలా సమీపంలో సుమారు 7 ఎకరాల్లో వందల కోట్ల విలువైన ఫామ్‌హౌస్ కూడా ఉంది.మొత్తానికి హృతిక్ కు రూ.3,101 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో హృతిక్ రోషన్ కూడా ఒకరు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.ఇలా భారీగానే సంపాదిస్తున్నారు హీరో హృతిక్ రోషన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube