అయోధ్యలో రాముడి వేషధారణలో చిన్నారి.. ఇది దైవలీలా.. లేక మరేదైనా మాయా?

అయోధ్య రామమందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం, బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తయిన వేళ ఓ అద్భుతం జరిగింది.

తొమ్మిదేళ్ల వేదిక జైస్వాల్ అనే చిన్నారి రాముడిలా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించింది.

బాల రాముడిలా ఉన్న వేదికను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.జనం ఆమెను చూసి చూపు తిప్పుకోలేకపోయారు.

ఆ చిన్నారి రూపురేఖలు, వేషధారణ అచ్చం బాల రాముడిని తలపించేలా ఉండటంతో అంతా ముగ్ధులయ్యారు.

ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేదికను చూసి పులకించిపోయారు.

ఆ చిన్నారి భక్తికి, రాముడి రూపానికి ఎంతో ముచ్చటపడ్డారు.చాలామంది ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

అంతేకాదు, వేదిక తన పర్యటన గురించి ఒక పద్యం చదివి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయోధ్యలోని పండుగ వాతావరణానికి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/01/A-child-dressed-as-Ram-in-Ayodhya-Is-this-a-ine-or-some-other-magica!--jpg" / వేదిక తల్లి దీక్షా జైస్వాల్ ( Deeksha Jaiswal )తన కుమార్తె రాముడితో ఉన్న అనుబంధం గురించి గొప్పగా చెప్పింది.

వేదిక రాముడిని తన స్నేహితుడిగా భావిస్తుందని, అందుకే రాముడిలా వేషం వేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుందని తెలిపింది.

పిల్లలను విమర్శించే బదులు మన సంస్కృతిని అర్థం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆమె సూచించింది.

తమ పిల్లలకు వారసత్వం గురించి నేర్పించడం ద్వారా వారి గుర్తింపు పట్ల గర్వపడేలా చేయవచ్చని ఆమె అభిప్రాయ పడింది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/01/A-child-dressed-as-Ram-in-Ayodhya-Is-this-a-ine-or-some-other-magicc!--jpg" / బాల రాముడే ఈ చిన్నారి రూపంలో తమ ముందుకు వచ్చినట్లున్నారు అని భక్తులు నమ్ముతున్నారు.

ఇది దైవలీలా, లేక మరేదైనా మాయా? అని ఆమె వీడియో చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు దీనిపై మీరు కూడా ఒక లుక్ చేయండి.

పిల్లలకు వారి మూలాలను పరిచయం చేయడం, వారి వారసత్వం పట్ల గర్వం కలిగేలా చేయడం చాలా ముఖ్యమని కూడా కామెంట్లు పెడుతున్నారు.

వేదిక, ఆమె కుటుంబానికి అయోధ్య సందర్శన ఒక మధురమైన, జ్ఞానదాయకమైన అనుభవంగా మిగిలిపోతుందని వాఖ్యానిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి26, ఆదివారం 2025