ఏపీలో కేబినెట్ విస్తరణ తుది దశకు చేరుకుంది.ఈ రోజు సాయంత్రానికి కొత్త మంత్రి వర్గంపై క్లారిటీ రానుంది.
కొత్తగా 15 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోనునన్నట్లు తెలుస్తోంది.పాత మంత్రి వర్గం నుంచి 10 మంది మంత్రులను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే రాజీనామా చేసిన మంత్రుల రాజీనామా లేఖలు గవర్నర్ కు చేరాయి.కొత్త మంత్రి వర్గంలోని పేర్లు కూడా ఈరోజు మధ్యాహ్నానికి గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
సామాజికి సమీకరణాలు, సమర్థత, జిల్లాల అవసరాలను పరినణలోకి తీసుకుని మంత్రి వర్గం కూర్పు ఉండనుంది.ఇద్దరు గిరిజనులు, ఇద్దరు మైనారిటీలు, ఆరుగురు ఎస్సీలకు క్యాబినెట్ లో చోటు దక్కుతుందని తెలుస్తోంది.
కొత్త మంత్రుల లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ లిస్ట్‌లో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు ఉండగా.
మిగిలిన పేర్లు అన్ని కొత్త వారివే.వైరల్ అవుతున్న లిస్ట్‌లో ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి వంటి వారి పేర్లు ఉన్నాయి.
ఇంకా ఆ లిస్ట్‌లో రెడ్డి శాంతి, పీడిక రాజన్నదొర, కొట్టు భాగ్యలక్ష్మీ, తిప్పల నాగిరెడ్డి,అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా,ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, తెల్లం బాలరాజు, సామినేని ఉదయభాను, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు,పిన్నెలి రామక్రిష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, తోపుదుర్తిరెడ్డి ప్రకాష్,జొన్నలగడ్డ పద్మావతి, కొరముట్ల శ్రీనివాసు,హఫీజ్ ఖాన్ ఉన్నారు.ఫైనల్ లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయో తెలియదు గానీ.
కొత్త మంత్రివర్గం ఇదేనంటూ చక్కర్లు కొడుతోంది.అయితే కేబినెట్‌లో కొత్తగా ఎవరిని తీసుకుంటారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే కొత్త మంత్రి వర్గంతో పాటు మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు జగన్ పార్టీ రిజినల్ కమిటీలు ఏర్పాటు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే సీఎం జగన్… రాజీనామా చేసిన మంత్రులు పార్టీ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తే మళ్లీ మీరే మంత్రులు అంటూ హామీలు ఇచ్చారు.దీంతో ఈ రోజు పార్టీ రీజినల్ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.







