టాలీవుడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో తనకు చాలా అవసరమైన సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమాలో అర్జున్ రెడ్డిని మించిన రొమాన్స్, అది కూడా నలుగురు భామలతో ఉండటంతో విజయ్ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ సినిమాలో నలుగురు బ్యూటీలతో రొమాన్స్ చేస్తున్న విజయ్ పాత్రపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడా లేక ఒకే పాత్రలో నటిస్తూ అందరితో రొమాన్స్ చేస్తున్నాడా అనే సందేహం అందరిలో మొదలైంది.
కాగా ఈ సినిమాలో విజయ్ పాత్రపై చిత్ర నిర్మాత కెఎస్ రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.ఈ సినిమాలో హీరోయిన్లు నలుగురు ఉన్నప్పటికీ హీరో పాత్ర మాత్రం ఒక్కటే అని తెలిపారు.
హీరో జీవితంలో వివిధ వయసులో ఏర్పడే ప్రేమను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇక విజయ్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తుండగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు.







