జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై నియమించిన ఆర్ముగస్వామి కమిషన్ ఇప్పటికే తన నివేదికను తమిళనాడు సర్కారుకు అందజేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ నివేదికలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

 Armugaswamy Commission Report On Jayalalitha's Death-TeluguStop.com

అనారోగ్య సమస్యలతోనే జయలలిత మరణించినా.ఆమె మరణించిన సమయం, జయలలితకు అందిన వైద్య చికిత్సలపై కమిషన్ సందేహాలు వ్యక్తం చేసింది.

అంతేకాకుండా జయలలిత నెచ్చెలి శశికళను విచారిస్తే ఈ వ్యవహాంలో అసలు విషయాలు వెలుగు చూస్తాయంటూ కమిషన్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.జయలలిత 2016 డిసెబర్ 5న మరణించినట్లు వైద్యులు చెబుతున్నా.

తాము విచారించిన సాక్షుల మాట ప్రకారం ఆమె 2016 డిసెంబర్ 4వ తేదీనే మరణించారని కమిషన్ పేర్కొంది.ఈ లెక్కన జయలలిత మరణించిన మరునాడు ఆమె మరణాన్ని ప్రకటించారని తెలిపింది.

జయలలిత మరణంపై శశికళతో పాటు ఆమె బంధువు అయిన వైద్యుడు, జయకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ శికుమార్, నాడు వైద్య, ఆరోగ్ శాఖ మంత్రి విజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శిలపై విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.జయ మరణంపై నెలకొన్న అనుమానాలు వీడాలంటే శశికళతో పాటు పైన చెప్పిన వారందరినీ విచారించాల్సిందేనని కూడా కమిషన్ తన నివేదకలో తెలిపింది.

జయలలిత మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించిన సంగతి తెలిసిందే.నాడు సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి.

ఈ అనుమానలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారు.ఇక గతేడాది ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జయ మరణంపై నెలకొన్న అనుమానాలను నిగ్గు తేలుస్తామని డీఎంకే ఛీఫ్ ఎంకే స్టాలిన్ కూడా ప్రకటించారు.

ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడంతో ఈ ఏడాది ఆగస్టులో ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube