పోటి నుంచి తప్పుకుంటున్న మెగా హీరో ?

సినిమా విడుదల తేదిని ముందే ప్రకటించడం, తరువాత షూటింగ్ పూర్తవక, లేదా పోటి పడలేక వాయిదా వేసుకోవడం తెలుగు ఇండస్ట్రీలో మామూలు విషయమే.ఇప్పుడు ఒక మెగా హీరో సినిమా విషయంలో ఇదే జరగబోతోంది.

 Kanche Release Postponed ?-TeluguStop.com

వరుణ్ తేజ్, ప్రజ్ఞ జైస్వాల్ జంటగా దర్శకుడు క్రిష్ రూపొందించిన చిత్రం కంచె … రెగ్యులర్ తెలుగు సినిమాలకు భిన్నంగా, వినుత్నమైన కథతో తెరకెక్కింది ఈ చిత్రం.రెండో ప్రపంచ యుద్ధాన్ని కథావస్తువుగా తీసుకొని, దాని చుట్టూ అందమైన ప్రేమకథ అల్లాడు క్రిష్ .అయితే ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఈ నెల 24 విడుదల అవుతున్న మరో మెగా చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కి పోటిగా దింపేందుకు సందేహిస్తున్నారట దర్శక నిర్మాతలు.సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దర్శకుడు హరీష్ శంకర్ కి మాస్ ప్రేక్షకుల మెప్పు ఉంది.

మంచి టాక్ వస్తే బ్రహ్మాండమైన కలెక్షన్లు వస్తాయి .మరోవైపు కమర్షియల్ గా లాభాలు తెచ్చిపెట్టిన క్రిష్ చిత్రాలు ఏవి లేవు .అందుకే ఎవరు లేని సమయంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు పథకం పన్నుతున్నారు.మరో విషయం ఏంటంటే, అక్టోబర్ 9న మరో మెగా హీరో అల్లు అర్జున్ నటించిన చిత్రం రుద్రమదేవి కుడా రానుంది .ముందు నుయ్యి, వెనక గొయ్యి అంటే ఇదేనేమో .అందుకే పోటిలోంచి కంచె వైదొలుగుతున్నట్లు సిని వర్గాల సమాచారం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube