కీలక కుంభకోణాల ఊసు ఉండదా?

రేపటి నుంచి (బుధవారం) ప్రారంభం కాబోతున్న తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో కీలక, సంచలన కుంభకోణాలు అయిన నోటుకు ఓటు, టేలిఫోనే ట్యాపింగ్ ప్రస్తావనకు రావని తెలుస్తున్నది.ఇది నిజంగా కొత్త విషయం ప్లస్ ఆశ్చర్యకరం కూడా.

 Telangana House Tight-lipped On Cash-for-vote Case-TeluguStop.com

ఎమ్మెల్యేలు తాము అడగదలచుకున్న ప్రశ్నలు ముందుగానే ఇవ్వాలి కదా.అన్ని పార్టీల నుంచి 150 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నలు ఇచ్చారు.కాని ఎవరూ కూడా కీలకమైన ఈ రెండు అంశాల మీద ప్రశ్నలు అడగలేదు.ఈ 150 ప్రశ్నల నుంచి మొదటి నాలుగు రోజుల కోసం 40 ప్రశ్నలు ఎంపిక చేసారు.

ఈ రెండు కుంభకోణాల మీద అసెంబ్లీలో దుమారం రేగుతుందని అనుకున్నారు.కాని అలాంటి పరిస్థితి కనబడటం లేదని సమాచారం.నోటుకు ఓటు కుంభకోణం గురించి అదికార పార్టీ సభ్యులు ప్రస్తావిస్తే టీడీపీ సభ్యులు ఊరుకోరు కదా.ఫోన్ ట్యాపింగ్ మీద దుమారం రేపుతారు.కాబట్టి అందరు నోరుమూసుకున్నరేమో.కాని ఇప్పుడే ఏమీ చెప్పలేము.సభలో ఏమైనా జరగవచ్చు.ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతుల ఆత్మహత్యల పైనే వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.

దీని మీద ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి.అసెంబ్లీ సజావుగా జరుగుతుందనే నమ్మకం లేదు.

అసెంబ్లీ జరగనివ్వ బోమని ఇప్పటికే కొందరు నాయకులు ప్రకటించారు.ఈ రణరంగం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube