నవంబర్ 8, 2016 తేదీని రాత్రి 8 గంటల సమయంలో దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన విషయం దేశ ప్రజలు, నాయకులూ అంత త్వరగా మర్చిపోలేరు.ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నల్లధనం( Black Money ) పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుందనే విషయం విదితమే.నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2000 నోటు అందుబాటులోకి వచ్చింది.తాజాగా వాటిని కూడా వెనక్కి తీసుకుంటోంది ఆర్బీఐ. ఈ క్రమంలో పెను మార్పులు సంభవించని చెప్పుకోవచ్చు.స్విస్ బ్యాంకుల్లో( Swiss Banks ) భారతీయుల సొమ్ము తగ్గిపోయిందని ఆయా బ్యాంకులు వాపోతున్న పరిస్థితి వుంది.నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార పరిణామం కారణంగా ఇది జరిగిందని వేరే చెప్పాల్సిన పనిలేదు.

అవును, గత సంవత్సర కాలంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.స్విట్జర్లాండ్‌లోని సెంట్రల్ బ్యాంక్( Central Bank of Switzerland ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.స్విస్ బ్యాంకుల్లో భారతీయుల వాటా బాగా క్షిణించింది.అయితే 2021తో పోలిస్తే భారతీయుల సొమ్ము దాదాపు 11 శాతం పడిపోయింది.అంటే భారతీయులు డిపాజిట్ చేసే మొత్తం బాగా తగ్గిపోయిందన్నమాట.దాదాపు రూ.30,000 కోట్లు (3.42 బిలియన్ స్విస్ ప్రాంక్‌లు) స్విస్ ఫ్రాంక్‌లు ఇప్పుడు మిగిలి ఉన్నాయి.ఈ లెక్కలు బయటకు వచ్చినప్పటి నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేస్తున్న సొమ్ము 34 శాతం తగ్గిందని పేర్కొంది.

2021లో బూమ్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ తాజాగా ప్రకటించింది.2021లో భారతీయ వినియోగదారులు 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను డిపాజిట్ చేయడం జరిగింది.ఈ మొత్తం గత 14 ఏళ్లలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు.స్విస్ నేషనల్ బ్యాంక్ అటువంటి తగ్గింపు గణాంకాలను ప్రకటించింది.దీని ప్రకారం.గత ఏడాది భారతీయులు డిపాజిట్ చేసిన మొత్తంలో 34 శాతం క్షీణత ఏర్పడింది.ఇప్పుడు ఈ మొత్తం 39.4 కోట్ల ఫ్రాంక్‌లు. 2021లో ఈ మొత్తం 60.2 కోట్ల ఫ్రాంక్‌లు.గత ఏడాది 110 కోట్ల ఫ్రాంక్‌లు ఇతర బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా జరిగాయి.కాగా 2.4 కోట్ల ఫ్రాంక్‌లు బదిలీ అయ్యాయి.మిగిలిన 189.6 కోట్ల ఫ్రాంక్‌లు బాండ్లు సేకరణ సేకరణ జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.