సాధారణంగా పట్టణాలలో ఇరుకైన ఇళ్లతో చాలామంది సర్దుకుంటుంటారు.ఆ ఇళ్లలో ఫర్నిచర్, ఇంకా వస్తువులను అడ్జస్ట్ చేయలేక తెగ ఇబ్బంది పడుతుంటారు.
అలాంటి వారి కోసం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఒక అదిరిపోయే వీడియో షేర్ చేశారు.నిజానికి ఆనంద్ మహీంద్రాకు సంక్లిష్టంగా రూపొందించిన వుడ్ వర్క్‌పై చాలా ఆసక్తి ఉంటుంది.
అతను ఎప్పుడూ అద్భుతమైన వుడ్ వర్క్ వీడియోలను షేర్ చేస్తుంటారు.ఇందులో భాగంగా రీసెంట్‌గా అతను ఇటీవల ట్విట్టర్‌లో ‘ఇట్స్ వుడ్ వర్కింగ్’( It’s Wood Working’ ) అనే పేజీ నుంచి ఒక పెద్ద వుడ్ స్టోరేజ్ మోడల్‌కు సంబంధించిన వీడియో పంచుకున్నారు.

ఈ వుడ్ స్టోరేజీని మెట్ల కింద తెలివిగా అమర్చగా.ఆ ఐడియాను ఆనంద్ బాగా పొగిడేశారు.ఉపయోగించలేని ప్రాంతంలో ఈ చెక్క షెల్ఫుల మోడల్ అమర్చడం వల్ల చాలా వస్తువులను అందులో ఉంచుకోవచ్చని అన్నారు.దీనివల్ల ఇంట్లో చాలా స్పేస్ ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అయితే చాలామంది నెటిజన్లు తాము కూడా ఇలానే చేశామంటూ ఫోటోలతో సహా తమ ఇరుకైన ఇళ్లను చూపించారు.

ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ క్యాప్షన్‌లో స్పేస్-సేవింగ్ డిజైన్‌పై తన ప్రేమను వ్యక్తం చేశారు.స్టార్ ట్రెక్ ఫిక్షనల్ టీవీ సిరీస్ ఫ్రాంచైజీని ప్రస్తావిస్తూ మెట్ల కింద స్పేస్‌ను “చివరి సరిహద్దు” అని సరదాగా పిలిచారు.ఇకపోతే మెట్ల కింద సరిగ్గా పట్టేలా ఈ ఫర్నిచర్ ను రూపొందించిన కార్పెంటర్లను చాలామంది నెటిజన్లు పొగిడారు.
ఈ వీడియోకు 18 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.కొంతమంది వినియోగదారులు దీనిని ప్రచార వ్యూహంగా భావించారు.ఒక వినియోగదారు హైదరాబాద్‌లోని తమ ఫ్యాక్టరీ ఇలాంటి ముక్కలను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నాడు, ఒక నమూనాను కూడా పంచుకుంటాడు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







