తిరుమల శేషాచల అడవులలో ఉన్న అతి పురాతమైన పార్వేట మండపంపై వివాదం చెలరేగుతోంది.టీటీడీ ఈవో ధర్మారెడ్డి సవాల్ ను బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి స్వీకరించారు.
ఈ మేరకు పక్కా ఆధారాలతో మండపానికి వస్తానని భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.ఈ నేపథ్యంలోనే దమ్ముంటే చర్చకు రావాలని ఈవోకు ఆయన ప్రతిసవాల్ విసిరారు.
శిథిలావాస్థకు చేరుకున్న పార్వేట మండపాన్ని కూల్చివేసి దాని స్థానంలో టీటీడీ అత్యాధునికంగా కొత్త మండపాన్ని నిర్మించింది.అయితే పురాతన మండపాలన్ని కూల్చివేయడాన్ని బీజేపీ తప్పుబడుతుంది.
పురాతన ఆలయాన్ని ఎలా కూల్చివేస్తారని మండిపడుతుంది.కూల్చివేత సమయంలో పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదన్నారు.
మరమ్మత్తుల పేరుతో పురాతన ఆలయాలను కూల్చివేయడం సరికాదని బీజేపీ ఆరోపిస్తుంది.ఈ నేపథ్యంలోనే పార్వేట మండపం సందర్శనకు రావాలన్న ఈవో సవాల్ ను బీజేపీ నేత భానుప్రకాశ్ స్వీకరించిన విషయం తెలిసిందే.