సాధారణంగా గుండెపోటు వయసు పైబడిన వారికి రావడం సర్వసాధారణం.బేబీ ఇంకా ఇతర అనారోగ్యాల కారణాలతో బాధపడే వాళ్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతారు.
కానీ కరోనా మహమ్మారి వచ్చాక పరిస్థితులు మొత్తం తారు మారయ్యాయి.వయసులో ఉన్న వాళ్ళు ఇంకా జిమ్ చేసే వాళ్ళు సైతం గుండెపోటుకు గురై మరణిస్తున్నారు.
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇంక చాలా మంది గుండెపోటుకు గురై మరణించారు.హఠాత్తుగా గుండెపోటు రావడం.
క్షణాల్లో మరణించడం ఇటీవల సంభవిస్తుంది.
పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు చెందిన మూడో తరగతి విద్యార్థికి గుండెపోటు వచ్చి మరణించడం అందరికి షాక్ గురి చేసింది.
అంత చిన్న వయస్సు బాలుడికి గుండెపోటు రావటం ఏంటని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.బోయిన్ పల్లి మండలం.
వెంకట్రావు పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం కోసం బుర్ర కౌశిక్ గౌడ్(8) క్యూలో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యం అప్రమత్తమయి ఆసుపత్రికి తరలించగా… గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.