హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ మేనేజ్ మెంట్, పేరంట్స్ తో ఎడ్యుకేషన్ కమిషనర్ చర్చలు ముగిశాయి.ఈ క్రమంలోనే స్కూల్ ని రీఓపెన్ చేయాలని తల్లిదండ్రులు కోరారు.
ఈ నేపథ్యంలో ఒపీనియన్ బ్యాలెట్ బాక్స్ తెరిచి పేరెంట్స్ వినతిపత్రాలు అందజేశారు.అదేవిధంగా పేరెంట్స్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని స్కూల్ డైరెక్టర్లు కోరారు.
భద్రతా చర్యలు కూడా పెంచుతామని కమిషనర్ దేవసేనకు హామీ ఇచ్చారు.గుర్తింపు రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేనేజ్ మెంట్ కోరింది.
ఈ క్రమంలో ఇరువురితో జరిపిన చర్చలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.పేరెంట్స్, మేనేజ్ మెంట్ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
డీఏవీ స్కూల్ రీఓపెన్ పై కమిషనర్ సానుకూలంగా మాట్లాడారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.అయితే విద్యాశాఖ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.







