ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.అన్ని ఆసుపత్రులు కాకపోయినా గాని చాలావరకు ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవడానికి అంతటి దారుణానికైనా ఒడిగట్టే పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రముఖ హాస్పిటల్ లో శవానికి ట్రీట్మెంట్ అని చెప్పి కొన్ని లక్షల డబ్బులు దోచేయడం వార్తల్లో మనం చూసాం.ఇప్పుడు ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
మేటర్ లోకి వెళ్తే యూపీలో ప్రయాగరాజ్ లో డెంగీ సోకిన రోగికి రక్తానికి బదులు … బత్తాయి జ్యూస్ ఎక్కించి అతని మరణానికి కారణమయ్యారు ఆసుపత్రి వైద్యులు.దీంతో అధికారులు సదరు ఆసుపత్రి పై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.
ఎల్లుండి లోపు ఆసుపత్రి ఖాళీ చేయాలని లేదంటే.బుల్డోజర్ తో కూల్చేస్తామని నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఇదే సమయంలో నకిలీ ప్లేట్ లెట్స్ సరఫరా చేసే ముఠాను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది.అయితే నోటీసులు ఇచ్చిన గాని ఆసుపత్రి యాజమాన్యం పెద్దగా పట్టించుకోకపోవడం సంచలనంగా మారింది.







