చాలాకాలం తర్వాత నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో టైం ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా బింబిసారా పేరు సొంతం చేసుకుంది.
ఈ విధంగా థియేటర్లో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది.ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయినప్పటికీ ఇంకా డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కాలేదు అయితే త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా జీ 5 అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారకంగా ప్రకటించింది.ఈ క్రమంలోని ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 21వ తేదీ ప్రసారం కానుంది.
ఈ విషయాన్ని జీ 5 తెలియజేస్తూ.కింద ఒకడున్నాడు వాడి పేరు బింబి త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పండి అంటూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అధికారక ప్రకటన వెల్లడించారు.ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారుడు, దేవదత్తుడు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు.
థియేటర్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.