ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ లను మర్యాదపూర్వకంగా కలువనున్నారని సమాచారం.
పర్యటనలో భాగంగా.సీఎం జగన్ సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు.రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ చేరుకుని జన్ పథ్ నివాసంలో బస చేయనున్నారు.సోమవారం ఉదయం ప్రధాని మోదీతో ఆయన భేటీకానున్నారు.







