కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వైరస్ సోకిన వాళ్లు ఒక విధంగా ఇబ్బందులు పడుతుంటే వైరస్ సోకని వాళ్లు, కీలక రంగాల్లో పని చేసే వాళ్లు మరో విధంగా ఇబ్బందులు పడుతున్నారు.కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమకు భారీగా నష్టాలు వచ్చాయనే సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్ నెల మూడవ వారం నుంచి థియేటర్లు మూతబడగా మరోవైపు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

స్టార్ హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకు అందరూ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తున్న హీరోలకు ఎటువంటి సమస్య లేకపోయినా ఒకటి కంటే ఎక్కువ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, జీవీ ప్రకాష్, అరుణ్ విజయ్ లాంటి నటులు మూడు కంటే ఎక్కువ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇప్పటికే ఈ హీరోలు వేర్వేరు పాత్రల్లో నటించిన సినిమాలు లాక్ డౌన్ వల్ల రిలీజ్ కాలేదు.
మరోవైపు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని సినిమాలు ఎప్పటికి షూటింగ్ పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.విజయ్ సేతుపతి నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండగా జీవీ ప్రకాష్ నటించిన ఐదు సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉండటం గమనార్హం.