సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ మరోసారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమని అంటున్నారు సినీ ప్రేక్షకులు.
సంక్రాంతి బరిలో మహేష్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అప్పుడే లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.
కాగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పికే హైప్‌ను మరింత ఎక్కువ క్రేజ్‌కు తీసుకొని వెళ్లాయి.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 5న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక ఈ ఈవెంట్‌కు ప్రేక్షకులు భారీ స్థాయిలో రానున్నారు.
కాగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని పిలిచారట చిత్ర యూనిట్.మహేష్ సినిమా కోసం మెగాస్టార్ ప్రమోషన్ సినిమాకు బాగా కలిసొస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా సూపర్‌స్టార్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ వస్తుండటంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గా్ల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాను చూసేందుకు జనాలు ఇప్పటినుంచే ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
మరి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.