తెలంగాణలో మూడో సారి బిఆర్ఎస్ పార్టి( BRS party ) అధికారంలోకి రానుందని బిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి( MLA Rajendra Reddy ) ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాజేంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.
రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, మత కల్లోలాలు లేకుండా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు.
బిఆర్ఎస్ పార్టిపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, రాబోవు ఎన్నికల్లో దేశం అంతటా బిఆర్ఎస్ పార్టి పోటీకి దిగి ఒక మార్క్ ను తెచ్చుకుంటుందని, తెలంగాణా మళ్ళీ కేసీఆర్( CM KCR ) ప్రభుత్వమే రావాలని దేవ దేవుడిని ప్రార్ధించినట్లు తెలిపారు.
తెలంగాణాలో కాంగ్రెస్ అనేది భూస్ధాపితం అయ్యిందని, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందని కొంత ఊపు వస్తుంది కానీ ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి లేదన్నారు.బిజేపి ఎదో పుంజుకున్నా వచ్చే సీట్లు కూడా రాకుండా పోతుందని, దేవుడి ఆశీర్వాదంతో 90 నుండి 100 సీట్లు వచ్చి మూడోవ సారి కచ్చితంగా ప్రభుత్వంను నడిపిస్తాంమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఒక మోడల్ గా ఉందని ఆయన చెప్పారు.