ఏపీ లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడంతో….రాజకీయ పార్టీల మధ్య టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది.
ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు రకరకాల పథకాలను ప్రకటిస్తూ… తమ పరపతి పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.ఈ సారి ఎన్నికలు టాఫ్ గా జరిగే ఛాన్స్ ఉండడంతో … ఒంటరిగా బరిలోకి వెళ్తే చేదు ఫలితాలు వస్తాయనే భావనలో … ఏదో ఒక పార్టీ తో పొత్తు కోసం ప్రతి పార్టీ ప్రయత్నిస్తోంది.
పైకి మాత్రం ఒంటరిగానే తాము ఎన్నికలకు వెళ్తామంటూ… గంభీరంగా చెప్పుకొస్తున్నాయి.

ఇక అధికార పార్టీ టీడీపీ విషయాన్ని పక్కన పెడితే… వైసీపీ – జనసేన పార్టీల పొత్తుల అంశాలపై రకరకాల కథనాలు బయటకి వస్తున్నాయి.ఈ రెండు పార్టీలు కేసీఆర్ సలహా మేరకు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే కథనాలు పెద్ద ఎత్తున రావడంతో… ఇరు పార్టీలు వాటిని ఖండించాయి.తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఇచ్చిన విందులో… కేసీఆర్- పవన్ రహస్యంగా మాట్లాడుకోవడం …పెద్ద చర్చకు దారితీస్తోంది.
గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు అనేక పార్టీల రాజకీయ నాయకులు హాజరయినప్పటికీ… పవన్ కేసీఆర్ ఇద్దరూ కలిసి చర్చించుకోవడం గురించే అందరిలోనూ.ఆసక్తి పెంచింది.ఈ ఇద్దరు దేని గురించి చర్చించుకున్నారు…? ఏపీలో వైసీపీ – జనసేన పార్టీల పొత్తు గురించే వీరిద్దరూ… చర్చించుకున్నారా …? కేసీఆర్ చెప్పిన మాటలకు పవన్ ఏం సమాధానం చెప్పాడు ఇలా అనేక ప్రశ్నలు అందరినోటా వినిపించాయి.

అయితే ఈ సమావేశానికి వైసీపీ అధినేత జగన్ మాత్రం హాజరు కాలేదు.కెసిఆర్ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని దాదాపు పది నిమిషాలు చర్చించారు.ఆ తర్వాత కెసిఆర్ ఇతర నాయకులని పలకరించడానికి వెళ్లగా, కెటిఆర్, పవన్ కళ్యాణ్ మరో పావుగంట సేపు చర్చించుకున్నారు.
వారి సంభాషణల్లో ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయంపైనే పవన్ కి సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
కేటీఆర్ జగన్ మధ్య ఇప్పటికే.ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరిగి ఉండడం, అలాగే జనసేన తో పొత్తు కుదుర్చుకోవడానికి వైయస్సార్సీపి టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఒత్తిడి చేస్తోందని పవన్ ప్రకటించడం తెలిసిందే.ఈ పరిణామాలన్నీ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి.

అదీ కాక కొద్దిరోజుల కిందట జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రముఖ టిఆర్ఎస్ నాయకుడు ఒకరు జగన్ తో జనసేన పొత్తు పెట్టుకుంటే మీ పార్టీకి పొత్తు లో భాగంగా 60 సీట్లు ఇప్పిస్తామని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ జగన్ తో పొత్తు ప్రతిపాదనను తిరస్కరించినట్టు చెప్పుకొచ్చారు.ఇక ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అవకాశం లేదనే అంతా భావిస్తున్న సమయంలో ఈ పవన్ తో కేసీఆర్, కేటీఆర్ చర్చలు జరపడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.







