ఇప్పుడంటే మనం చాలా స్వేఛ్చగా బ్రతుకుతున్నాం కానీ.ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేవి పరిస్థితులు.
ముఖ్యంగా రాజుల కాలంలో అయితే అత్యంత దారుణంగా బ్రతికేవారు మన పెద్దలు.అయితే రాజుల కాలంలో బానిస గదులు అని స్పెసల్ గా ఉండేవంట.
వీటిలోకి రాజులు కేవలం తమ బానిసలను మాత్రమే ఉంచి చిత్ర హింసలు పెట్టేవారని చరిత్ర చెబుతోంది.అయితే కాలం మారిన కొద్దీ ఈ బానిసత్వపు ప్రపంచం అంతరించిపోయింది.
ఇప్పుడున్నదంతా కూడా స్వేఛ్చకు సంబంధించిన ప్రపంచమే.
కాగా ఇప్పుడున్న వారికి ఒకప్పటి బానిస బతుకుల గురించి చెబితే నిజంగానే వణికిపోతారు.
అలా ఎలా బ్రతికారంటూ షాక్ అవుతారు.అందుకే ఇప్పటి తరం ఆనాటి తరానికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా చాలా ఆసక్తికరంగా తెలుసుకుంటుంది.
ఇప్పుడు కూడా పురాతన బానిసత్వానికి సంబంధించిన గది ఒకటి ఇటలీలోని రోమ్‌లో బయటపడింది.పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఈ గది బయటపడిందని చెబుతున్నారు అధికారులు.
పాంపీ నగరానికి చెందినటువంటి సైంటిస్టులు చేపట్టిన తవ్వకాళ్లో ఇకా పాడవకుండా ఉన్న వస్తువు కనపడ్డాయి.

ఈ రూమ్‌లో మూడు పడుకునే బెడ్లు చాలా పెద్దవి, అలాగే ఓ మట్టి కుండ లాంటి వస్తువులను సైంటిస్టులు గుర్తించారు.ఇందులో ఉన్న మంచాలు దాదాపు 1.7 మీటర్ల పొడవుతో చాలా పెద్దగా ఉన్నాయి.అయితే ఈ గదిమొత్తం చీకటితో ఉందని పైగా ఆ గదిలో ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ముగ్గురు బానిసలను బంధించారని గుర్తించారు సైంటిస్టులు.పైగా అత్యంత పాశికంగా రూమ్ ఉందని పాంపీ డైరెక్టర్ జనరల్ అయిన గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ దీని గురించి పూర్తిగా వివరించారు.
దీన్ని బట్టి ఆనాటి కాలంలో ఎలాంటి శిక్షలు ఉండేవో అర్థం అవుతోందని చెప్పారు సైంటిస్టులు.ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.