పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )నుండి ఈనెల బ్రో సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 20 రోజుల డేట్లు మాత్రమే ఇచ్చాడు.రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలో పూర్తి అయ్యే సినిమా లకు మాత్రమే కమిట్ అవుతున్నాడు.
ఆ సినిమాలు ఇప్పుడు విడుదల కాబోతున్నాయి.

బ్రో సినిమా తో పాటు ఓజీ సినిమా ను పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.బ్రో సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతుండగా… ఓజీ సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఇతర పవన్ కళ్యాణ్ సినిమా లు మాత్రం ఈ ఏడాది లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఎప్పుడో రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా ( Hari Hara Veera Mallu )షూటింగ్ ఇప్పటికి కూడా పూర్తి అవ్వలేదు.అంతే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలు పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ను కూడా మొదలు పెట్టినప్పటికి సినిమా విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.
ప్రస్తుతం బ్రో.ఓజీ సినిమా లపైనే ఆయన దృష్టి ఉంది.

అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కానీ ఆ రెండు సినిమాల గురించి పవన్ పట్టించుకోని కారణంగా అసలు ఎప్పటి వరకు సినిమా లు వస్తాయి అనేది క్లారిటీ లేదు.జనసేన పార్టీ( JanaSena Party ) కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అవుతున్నాడు.కనుక ముందు ముందు కూడా ఈ రెండు సినిమా లను ముగించి విడుదల చేసే విషయం లో పవన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.
వచ్చే ఏడాది లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ కు ఎన్నికలు జరుగబోతున్నాయి.ఆ ఎన్నికలకు సంబంధించిన హడావిడి లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.ఇప్పటికే వారాహి యాత్రను మొదలు పెట్టడం ద్వారా ఎన్నికల కోసం సమర శంఖం పూరించాడు.కనుక ఉస్తాద్.
వీరమల్లు సినిమాలు ఇప్పట్లో లేనట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.







