విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది.ఇందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో కీలక సమావేశం ఏర్పాటుచేసింది.
ఈ సమావేశానికి 14 ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు హాజరు అయ్యాయి.అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఈ భేటీకి గైర్హాజరు అయ్యారని తెలుస్తోంది.
విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా అధికారులు చర్చిస్తున్నారు.







