తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.తక్కువ మెజారిటీ సీట్లతో అందలం ఎక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
తర్వాత కేవలం నాలుగేళ్ల లోనే.ముందస్తు ఎన్నికలకు పోయి.
భారీ విజయాన్ని అందుకున్నాడు.మొదటి సారి గెలిచిన తర్వాత అసలు ప్రత్యర్థులు ఉండకూడదు అని.టీడీపీ పై ఫోకస్ పెట్టారు.టిడిపి నుంచి గెలిచిన మహా మహులను.
పార్టీ లోకి ఆహ్వానించారు.నోటిఫికేషన్ లు, పథకాలు అంటూ మొదటి విడతలో భారీ హడావుడి చేశారు.
దాంతో.ప్రజల్లో పాజిటివ్ నేస్ పెరిగి పోయింది.
అది చల్లారి లోపు మరోసారి విజయం కోసం ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తో పాటు అసెంబ్లీ కి ఎన్నికలు జరిగేవి.
కేసిఆర్ ముందస్తు కు పోవడం తో.ఆంధ్రా కంటే ముందు గానే తెలంగాణ లో ఎన్నికలు జరిగాయి.

ఇక 2018 లో ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ అఖండ మెజారిటీ సాధించారు.ప్రతి పక్షాలకు చుక్కలు చూపిస్తూ అధికారం చేపట్టారు.అయితే రెండోసారి గెలిచిన తర్వాత కెసిఆర్ ఫామ్ తగ్గింది.ప్రతి పక్షాలు కొంత బలపడ్డాయి.ప్రతి పక్షాలు బలం పుకుకోడం.అటు కొత్త పార్టీలు పుట్టుకు రావడం.
కెసిఆర్ విజయ అవకాశాలను కటినం చేశాయి.

ఢిల్లీ లోని బీజేపీ గల్లీ లోకి పాకింది.కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ కు పటిష్టం చేసుకుంటూ ఉంది.ముస్లిం ఓట్లను మజ్లిస్ తన ఖాతాలో ఉంచుకుంది.
హిందుత్వ ఎజెండా గా బీజేపీ రాజకీయాలు మొదలు పెట్టింది.క్రిస్టియన్ ఓట్ల కోసం షర్మిల పార్టీ పెట్టుకుంది.
ఇక బహుజనుల ఓట్లు అంటూ బీఎస్పీ నుంచి ప్రవీణ్ కుమార్ నిలుచున్నారు.ఒక్కో వర్గం చిలిపోతే అల్టిమేట్ గా కెసిఆర్ కు కలిసి వస్తుంది అని బీ అర్ ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
కాకపోతే అది మెజారిటీ సీట్లను తగ్గిస్తుంది.అప్పుడు తప్పకుండా.
పక్క పార్టీ ల ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడమో.పొత్తు పెట్టుకోవడమో చేయాల్సి వస్తుంది.
ఒకవేళ అదే పరిస్థితి వస్తె అది తప్పకుండా కెసిఆర్ హ్యాట్రిక్ కాదని విశ్లేషకులు అంటున్నారు.మరి ముందు రాబోతున్న పెను విధ్వంసాన్ని కెసిఆర్ ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి.







