సూపర్ నేపియర్ పశుగ్రాసం సాగులో మేలు రకం విత్తనాలు.. సస్యరక్షక పధ్ధతులు..!

వ్యవసాయ రైతులు పంటలతో పాటు పశువుల పెంపకానికి( cattle rearing ) కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.పశువుల పెంపకానికి అవసరమయ్యే పశుపోషణలో పశుగ్రాసం( Fodder ) కీలకం.

 Super Napier Is The Best Type Of Seeds For Fodder Cultivation Plant Protection-TeluguStop.com

పశుగ్రాసం పంటలో కొన్ని కీలక సస్యరక్షణ పద్ధతులు పాటించి తక్కువ పెట్టుబడి తో అధిక పంటను పొందవచ్చు.సూపర్ నేపియర్ పశుగ్రాసం లో అధిక దిగుబడి కోసం కో -3, కో-4, కో-5, ఎ.పి.బి.ఎన్-1, ఎన్.బి-21 హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.పశువుల పెంపకంలో పశుగ్రాసం కొరతను అధికమించడం కోసం ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం ను అభివృద్ధి చేశారు.అధిక పోషక విలువలు ఉండడంతో పాటు చలికాలంలో కూడా విపరీతంగా పెరుగుతుంది.

ఈ పశుగ్రాసాన్ని ఒక్క చౌడు నేలలలో తప్ప మిగతా అన్ని నేలలలో సాగు చేయడానికి అనుకూలమే అని చెప్పవచ్చు.భూమిలో చివరి దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువులు, 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియదున్నలి.

ఒక ఎకరాకు పదివేల కాండపు కణుపులు( Stem nodes ) అవసరం.ప్రతి కణుపుకు రెండు నోడ్స్ ఉండేలా, భూమిలో మూడు అడుగుల వ్యత్యాసంలో ఏటవాలుగా నొడు గుచ్చాలి.

Telugu Agriculture, Cattle, Fodder, Latest Telugu, Methods, Stem Nodes, Napier-L

కణుపులు నాటిన 30 రోజుల తర్వాత నత్రజనిని పైరుకు వేస్తే గడ్డి పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది.నెలలో రెండు సార్లు కచ్చితంగా నీటి తడి అందించాలి.మొదటి కోత రెండు నెలలకు వస్తుంది.అంటే సంవత్సరానికి దాదాపు 8 కోతలు వస్తాయి.ప్రతిసారి కోత అనంతరం 20 కిలోల నత్రజని ఎరువులతో పాటు పశువుల ఎరువులు, సూపర్ ఫాస్పేట్ ఎరువులు, పొటాష్ ఎరువులు అందిస్తే, గడ్డి విపరీతంగా పెరిగి తొందరగా కోతకు వస్తుంది.

Telugu Agriculture, Cattle, Fodder, Latest Telugu, Methods, Stem Nodes, Napier-L

ఒక ఎకరాలో సాగు చేసే ఈ గడ్డితో దాదాపు పది పాడి పశువులకు ఏడాది పొడవునా పశుగ్రాసాన్ని అందించవచ్చు.అయితే ఈ గడ్డిని చాప కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.లేదంటే కేవలం ఆకులు మాత్రమే తిని కాడను వదిలేస్తాయి.

అంతేకాకుండా ఈ గడ్డిలో అలసంద, పిల్లి పెసర కలిపి పశువులకు మేపితే పాల దిగుబడి కూడా అధికంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube