శివరాత్రి హిందూ సంప్రదాయంలో చాలా పెద్ద పండుగ.సాధారణంగా చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు.
ఈ రోజున పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని ప్రతీతి.ఈ రోజున శివుని వివాహం కూడా జరుగుతుంది.
మహాదేవుని ఆరాధించడం ద్వారా మనిషి తన జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతాడు.ఉపవాసం, మంత్రోచ్ఛారణ మరియు రాత్రి జాగరణకు ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఫిబ్రవరి 18న అంటే ఈరోజు శివరాత్రి మహోత్సవం వాడవాడలా జరుగుతోంది.శివరాత్రి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
ఈరోజు మహాశివుని దీవెనలు లభించి, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.ఈ రోజున భక్తులు మహాశివరాత్రి వ్రత కథను కూడా పఠిస్తారు.
ప్రతి రాశివారికి వారి శ్రేయస్సు కోసం ప్రత్యేక మంత్ర విధానం ఉంటుంది.రాశిని అనుసరించి మహాశివరాత్రినాడు ఆ మంత్రాలను పఠించే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారు శివునికి జటం సమర్పించిన తర్వాత “ఓం నాగేశ్వరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
వృషభం
వృషభ రాశి వారు శివలింగానికి పాలు సమర్పించిన తర్వాత 51 సార్లు “ఓం నమః శివాయ” అని జపించాలి.
మిధునరాశి
శివుని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ రాశి వారు శివుని రుద్రాష్టకంలోని మంత్రాన్ని జపించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు మహాశివరాత్రి నాడు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి శివచాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించాలి.
సింహరాశి
సింహ రాశి వారు మహాదేవునికి ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించి పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
కన్య రాశి
ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించాలి.మంత్రాన్ని జపించేటప్పుడు, వ్యక్తి దానిని సరిగ్గా ఉచ్చరించేలా చూసుకోవాలి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారు శివుడు మరియు పార్వతి దేవిని కలిసి పూజించాలి.”ఓం పార్వతీ నాథాయ నమః” అని 51 సార్లు జపించాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు మహాదేవుని పూజించిన తర్వాత రుద్రాష్టకం స్తోత్రాన్ని పఠించాలి.శివునికి జలం సమర్పించేటప్పుడు “ఓం అంగరేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
మకరరాశి
ఈ రాశి వారు శివునికి చందనం పూసిన తర్వాత “ఓం భమేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని 51 సార్లు జపించాలి.
కుంభ రాశి
శని దేవుడు మకరం మరియు కుంభ రాశులకు అధిపతి.ఈ రాశి వారు శివునికి పాలు, పెరుగు, తేనె సమర్పించిన తర్వాత “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
మీనరాశి
మహాశివరాత్రి సందర్భంగా మీనరాశి వారు ఆలయంలో కూర్చుని శివ పంచాక్షరి చదవడం ఉత్తమం.
DEVOTIONAL