2024 లో తెలంగాణ ముఖ్యమంత్రి వారసుడేనా?

తెలంగాణ రాష్ట్రం లో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.మూడవ సారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా ధీమా తో ఉన్నారు.

 If Kcr Goes To Delhi, Ktr Will Be The Chief Minister Of Telangana ,kcr , Ktr ,-TeluguStop.com

ఇక 2023 డిసెంబర్ లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి( CM KCR )గా బాధ్యతలు చేపట్టబోతున్నారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.మరో వైపు 2024 పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా మినిమం స్థానాలు సొంతం చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ సత్తా చాటే అవకాశం ఉంటుంది.

Telugu Bandi Sanjay, Congress, Delhi, Telangana Cm, Ts-Politics

అందుకే ఆ సమయం లో కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీలో చక్రం తిప్పుతూ కేంద్ర మంత్రి గా లేదా అవకాశం దక్కితే ప్రధానిగా కేసీఆర్ విధులు నిర్వహిస్తూ ఉంటే కేటీఆర్( K.T.Rama Rao ) తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని ఆ పార్టీ నాయకులు కలల్లో తేలి పోతున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Delhi, Telangana Cm, Ts-Politics

మొత్తానికి కేసీఆర్ మరియు కేటీఆర్ స్థానాలు వచ్చే సంవత్సరంలో మారబోతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ వారు బలంగా విశ్వసిస్తున్నారు.పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ విషయం పై చాలా ఉత్కంఠత తో ఎదురు చూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఇప్పటికే విధులు నిర్వహించాల్సి ఉంది.

Telugu Bandi Sanjay, Congress, Delhi, Telangana Cm, Ts-Politics

కానీ కొన్ని కారణాల వల్ల కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారని.ఏదో ఒక సమయంలో కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.మరో వైపు బీజేపీ మాత్రం కేటీఆర్‌ ను ఎలాంటి వివాదం లేకుండా ముఖ్యమంత్రిగా చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ( BRS party ) ఏర్పాటు చేశారని.జాతీయ స్థాయిలో కేసీఆర్‌ చేసేది ఏమీ లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube