టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.టీఎస్పీఎస్సీ పేపర్లను అంగటిలో అమ్మకానికి పెట్టారని విమర్శించారు.
ఈ మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సభను సరూర్ నగర్ లో నిర్వహిస్తామని తెలిపారు.నిరుద్యోగ సభలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు, రైతులకు ఒరిగిందేమి లేదని ఆరోపించారు.







