తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలను చెప్పిన విధంగా అమలు చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.రుణమాఫీ లాంటి భారీ పథకాలకు సైతం డెడ్ లైన్ విధించుకుని చెప్పిన తేదీలోగా ఆ పథకాలను కచ్చితంగా అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు సంతృప్తితోనే ఉన్నారు.
అయితే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి( Naimisha Reddy ) తాజాగా మంచి మనస్సును చాటుకున్నారు.అనాథ పిల్లల( Orphan children ) కోసం ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.30 మంది అనాథ పిల్లల కోరికను నెరవేర్చిన ఆమెకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.ఎల్బీ నగర్ లోని ఒక అనాథాశ్రమానికి చెందిన పిల్లలు స్టేడియంలో క్రికెట్ చూడాలని భావించగా ఈ విషయం నైమిషారెడ్డి దృష్టికి వచ్చింది.

అనాథ పిల్లల కోరిక తీర్చాలనే ఆలోచనతో నిన్న ఉప్పల్ స్టేడియంలో( Uppal Stadium ) జరిగిన మ్యాచ్ కు ఆమె పిల్లలను తీసుకుని వెళ్లారని తెలుస్తోంది.స్టేడియంలో తాము ఎంతగానో అభిమానించే ప్లేయర్లను దగ్గరినుంచి చూసిన పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.నైమిషా రెడ్డి పిల్లల కళ్లలో ఆనందం చూడాలని ఈ పని చేసినట్టు ఆమె సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

నైమిషారెడ్డి భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమంది కష్టాలను తీర్చాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.సేవా కార్యక్రమాలు చేయాలంటే ఎంతో మంచి మనస్సు ఉండాలని ఆ మనస్సు నైమిషారెడ్డికి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.8 కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని సర్వేలలో వెల్లడవుతోంది.