మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ బదలాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.హత్య కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 21న తీర్పు ఇవ్వనుంది.
ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా… తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.షెడ్యూల్ ప్రకారం ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉంది.
అయితే జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వచ్చే సోమవారం ప్రకటిస్తామని తెలిపింది.బెంచ్ లోని మరో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో తీర్పు వాయిదా పడినట్లు సమాచారం.