ఛత్తీస్‌గఢ్‌లోని( Chhattisgarh ) బగ్‌బహారాలో ఉన్న చండీ మాతా మందిర్‌లో( Chandi Mata Mandir ) ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో ఒక అడవి ఎలుగుబంటి( Bear ) శివలింగాన్ని( Shivling ) ప్రేమగా కౌగిలించుకుంటుంది.ఈ దృశ్యాలు అందరి హృదయాలను టచ్ చేస్తున్నాయి.
ఈ అరుదైన దృశ్యం ఆధ్యాత్మిక భావనలను రేకెత్తించడంతో పాటు ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఆ వీడియోలో ఎలుగుబంటి తన రెండు చేతులతో శివలింగాన్ని గట్టిగా పట్టుకుంది.
మెల్లగా తన తలను ఆ విగ్రహంపై ఆనించింది.తన పాదాలను శివలింగంపై మృదువుగా కదిలిస్తూ ప్రేమను కురిపించింది.
ఆ శివలింగం చూడటానికి ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పోలి ఉంది.ఎలుగుబంటి చాలా ప్రశాంతంగా, ప్రేమగా ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అది తనదైన రీతిలో భక్తిని ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది.
ఈ వింతైన సంఘటన భక్తులను, జంతు ప్రేమికులను ఒకేసారి ఆశ్చర్యపరిచింది.ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ ఇది ఒక దివ్యమైన క్షణమని అభివర్ణిస్తున్నారు.ఆన్‌లైన్ వేదికలపై “హర్ హర్ మహాదేవ్” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఎలుగుబంటి చర్య ద్వారా కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని వారు వ్యక్తం చేస్తున్నారు.
“బగ్‌బహారాలోని ఒక గుడిలో ఒక ఎలుగుబంటి శివలింగాన్ని నిజమైన భక్తుడిలా కౌగిలించుకుంటున్న ఒక అందమైన వీడియో, ఈ అద్భుత క్షణం గురించి మీరేమనుకుంటున్నారు?” అంటూ @Thebharatpost__ అనే X యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ అసాధారణమైన ఘటన ప్రకృతికి, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న అనుబంధంపై చర్చకు దారితీసింది.
వన్యప్రాణుల అందం, రహస్యాలను గుర్తు చేస్తూ మానవ విశ్వాసంతో వాటికున్న అనుకోని బంధాన్ని తెలియజేస్తోంది.