ఏడాది పొడవునా విరివిరిగా లభ్యమయ్యే కూరగాయల్లో టమాటో( Tomato ) ఒకటి.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో కూడా టమాటో ముందు వరుసలో ఉంటుంది.
టమాటోలు చవక ధరకే లభించినా.బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా అవి మనకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వెయిట్ లాస్( Weight Loss ) కు కూడా టమాటో అద్భుతంగా సహాయపడుతుంది.
ముఖ్యంగా టమాటోను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే నెలకు నాలుగు కేజీలు బరువు తగ్గడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ అవ్వడానికి టమాటోను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా రెండు టమాటోలను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక క్యారెట్ ను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేయించిన రోల్డ్ ఓట్స్( Rolled Oats ), రెండు అల్లం స్లైసెస్, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా టమాటో క్యారెట్ ఓట్స్ స్మూతీ( Tomato Carrot Oats Smoothie ) సిద్దమవుతుంది.ఈ స్మూతీ క్యాలరీలను బర్న్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
నిత్యం ఈ స్మూతీని తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.
మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో వేగంగా బరువు తగ్గుతారు.
పొట్ట కొవ్వు మాయం అవుతుంది.
కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ స్మూతీని తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.
ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.మరియు చర్మం యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.