Preetham Jukalker : నాగచైతన్య చాలా మంచివాడు.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ వైరల్?

ప్రీతమ్ జుకల్కర్( Preetham jukalker ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Stylist Preetham Jukalker Comments About Samantha And Nagachaitanya-TeluguStop.com

స్టార్ హీరోయిన్ సమంత కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రీతమ్ జుకల్కర్ మనందరికీ సుపరిచితమే.ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన సమయంలో ఇతని పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే.

దారుణమైన ట్రోల్స్ చేయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ చేస్తూ అతనిపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు నాగచైతన్య సమంత అభిమానులు.ఒకరకంగా నాగచైతన్య సమంత (Naga Chaitanya )విడిపోవడానికి అతనే కారణం అంటూ దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.

Telugu Naga Chaitanya, Samantha, Tollywood-Movie

అయితే ఆ సమయంలో అతని పేరు అంతగా మారుమోగినా కూడా మీడియా ముందు ఒక్కసారి కూడా రాలేదు.కాగా ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రీతమ్ మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ప్రీతమ్ మాట్లాడుతూ.సమంత నన్ను నమ్మి నా ప్రతిభను ప్రోత్సహించింది.తన ప్రోత్సాహం వల్లే నేను ముందడుగు వేశాను.

తనకు స్టైలింగ్ చేశాను.కానీ చాలా మంది మా ఇద్దరిని విమర్శించారు.

ఇతడు అవసరమా ? పాత స్టైలిస్ట్ దగ్గరికే వెళ్లొచ్చుగా ఈ బొంబాయి వాళ్లను ఎందుకు నమ్ముతావు అని చాలా రకాలుగా అన్నారు.ఆ మాటలు చాలా బాధేశాయి.

Telugu Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఎలాంటి పరిచయాలు లేకుండానే ఇండస్ట్రీకి వచ్చాను.నేనెమీ చెడ్డవాడిని కాదు, నైపుణ్యాలు ఉన్న వ్యక్తినే.ఒక ఆర్టిస్ట్ ను కూడా.నేను హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా ఎందుకు డిజైన్ చేస్తానంటే వాళ్లు ప్రయోగాలు ఒప్పుకుంటారు.కానీ హీరోలు విభిన్న కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఇష్టపడరు.గతంలో సామ్ నాతో( Samantha ) కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది.

అది చూసి అందరూ ఏవేవో అన్నారు.మా ఇద్దరి అన్నా చెల్లెళ్ల బంధం అనుకోవచ్చు కదా.మేమి స్నేహితులం మాత్రమే. చైసామ్ విడిపోయినప్పుడు నన్ను అన్నారు.

అంతేకాకుండా నాకుటుంబాన్ని లాగారు.నన్ను అన్నప్పుడు భరించాను.

కానీ నా కుటుంబాన్ని అనప్పుడు కోపం వచ్చింది.చైతన్య చాలా మంచివాడు.

నేను కలిసిన మంచి వ్యక్తులలో అతడు కూడా ఒకరు.నా కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నాను.

నా స్థానంలో మరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు.నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ టార్గెట్ చేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రీతమ్ జుకల్కర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube