Tamarind Seeds Benefits : చింత గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

వేసవికాలంలో చాలా పల్లెటూర్లలో మహిళలు గుంపులుగా చేరి ఒక చెట్టు కింద కూర్చుని చింత గింజలు( Tamarind Seeds ) ఒలుస్తూ కనిపిస్తారు.సాయంత్రం అయినా తర్వాత ఒలిచినా గింజలను డబ్బాలో తీసుకెళ్లి చెత్త లో పారవేస్తూ ఉంటారు.

 Amazing Health Benefits Of Tamarind Seeds-TeluguStop.com

ఇది సాధారణంగా చాలా గ్రామాలలో జరుగుతూనే ఉంటుంది.అయితే చాలామంది ప్రజలు చింతపండు మాత్రమే ఉపయోగించాలి.

చింత గింజలు వృధాగా పారవేయాలి అని అనుకుంటూ ఉంటారు.చింతపండు కంటే చింత గింజల తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

చింత గింజలతో వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.వీటిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

చింత గింజల ఉపయోగాల గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కీళ్ల నొప్పులతో( Knee Pains ) బాధ పడే వారికి చింత గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు.

-Telugu Health

అందుకోసం చింత గింజలను పొడి చేసి, అందులో నీళ్లు కలిపి పేస్టులా చేసి రోజు దంతాలను తోమాలి.దీంతో దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాల పై ఉన్న గార పాచి దూరమైపోతుంది.అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చింత గింజలు దివ్య ఔషధంగా పని చేస్తాయి.

ఇందులో చింత గింజల పొడిని నీళ్లలో కలిపి మరిగించి డికాషన్ లాగా తయారు చేసుకోవాలి.దీనిని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు ఒక కప్పు మాత్రమే తగిన మోతాదులో తీసుకోవాలి.

దీంతో షుగర్ లెవెల్స్( Sugar Levels ) తగ్గుతాయి.చింత గింజల పొడి డికాషన్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హై బీపీ కూడా తగ్గుతుంది.ఈ గింజలలో ఉండే పొటాషియం బిపిని తగ్గిస్తుంది.చింత గింజలలో యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్ల పై రాయాలి.

-Telugu Health

ఇలా చేస్తే అవి త్వరగా నయం అయిపోతాయి.చింతగింజలలో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పై ఉన్న మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.చింత గింజలను పొడిలా తయారుచేసి ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

చింత గింజల పొడి( Tamarind Seeds Powder )ని రోజు ఒక టీ స్పూన్ మేర రోజుకు రెండుసార్లు నీటిలో కలిపి తీసుకోవాలి.పాలు లేదా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు.

దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube