ఈ మధ్యకాలంలో ఐశ్వర్యరాయ్ ,అభిషేక్ బచ్చన్ ( Aishwarya Rai, Abhishek bacchan ) గురించి ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే రీసెంట్గా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ఐశ్వర్యరాయ్ తన కూతుర్ని తీసుకొని అమితాబ్ బచ్చన్ ( Amithab bacchan ) ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేసిందని, త్వరలోనే వీరిద్దరూ విడాకుల విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని, ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు అంటూ ఇలా ఎన్నో రూమర్లు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
దాంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్.
ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కంటే ముందే సల్మాన్ ఖాన్ ( Salman khan ) తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.
ఆయనతో ప్రేమాయణం ఎక్కడిదాకా వెళ్ళిందంటే పెళ్లి చేసుకుంటారు అనేదాకా వెళ్ళింది.కానీ వీరి ప్రేమ పీక్స్ లో ఉన్న సమయంలోనే సల్మాన్ ఖాన్ పెట్టే టార్చర్ భరించలేక ఐశ్వర్యరాయ్ తనకు బ్రేకప్ చెప్పింది.
ఆ తర్వాత వివేక్ ఒబేరాయ్ తో లవ్ ట్రాక్ నడిపి చివరికి అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయింది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఓ బర్త్డే పార్టీలో ఐశ్వర్యరాయ్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ అలాగే అభిషేక్ బచ్చన్ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకొని హగ్గిచ్చుకోవడం బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.ఎందుకంటే అభిషేక్ బచ్చన్ కి తన భార్య మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ అనే సంగతి తెలుసు.అయితే ఇప్పటివరకు వీరిద్దరూ అంత ఆప్యాయంగా ఎప్పుడూ కూడా మాట్లాడలేదు.
అయితే సడన్ గా వీరిద్దరూ అలా సన్నిహితంగా ఉండేసరికి అందరూ షాక్ అయ్యారు.

ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్, అలాగే నిర్మాత అయిన ఆనంద్ పండిట్ ( Anand pandit ) పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్ ఖాన్ అలాగే అభిషేక్ బచ్చన్ పాల్గొన్నారు.అయితే ఈ పార్టీలో సల్మాన్ అభిషేక్ ఎదురెదురు కావడంతో ఇద్దరూ హగ్ చేసుకుని క్లోజ్ గా మాట్లాడుకున్నారు.అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ వీరిద్దరిని అలా చూసి ఐశ్వర్యరాయ్ పరిస్థితి ఏంటో అంటూ కామెంట్లు పెడుతున్నారు.