బిగ్ బాస్ నుంచి తప్పుకుంటానన్న నాగ్.. కారణమేమిటంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో మరో నాలుగు వారాల్లో ముగుస్తున్న సంగతి తెలిసిందే.ఆదివారం రోజు లాస్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

 Bigg Boss Host Nagarjuna Serious Warning To Organizers, Nagarjuna,bigg Boss Show-TeluguStop.com

అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో బిగ్ బాస్ షోకు లీకులు పెద్ద సమస్యగా మారాయి.ఏ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో షో టెలీకాస్ట్ కావడానికి ముందురోజే ప్రేక్షకులకు తెలిసిపోతుంది.
ఎలిమినేషన్లతో పాటు నామినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి కూడా ప్రేక్షకులకు ముందుగానే లీక్ అవుతున్నాయి.ఈ లీకుల వల్ల ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షోను చూడాలనే ఆసక్తి తగ్గడంతో పాటు ఆ ప్రభావం షో టీఆర్పీ రేటింగ్ పై పడుతోంది.

ఈ విషయాలు హోస్ట్ నాగార్జున దృష్టికి రావడంతో నాగార్జున షో నిర్వాహకులపై సీరియస్ అయ్యారని సమాచారం.ఇకపై కూడా ఇదే విధంగా లీకులు కొనసాగితే తాను బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటానని నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Bigg Boss, Biggboss, Bigg Boss Show, Leaks, Nagarjuna, Organizers-Gossips

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 ఎలిమినేషన్ల విషయంలో ప్రేక్షకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది.ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రతి విషయం ముందుగానే లీక్ కావడంతో షోలో సస్పెన్స్ లేకుండా పోతుంది.గత సీజన్లలో కూడా లీకులు జరిగినా ఈ స్థాయిలో లీకులు జరగలేదనే సంగతి తెలిసిందే. నాగార్జున వార్నింగ్ తో బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం.

బిగ్ బాస్ నిర్వాహకులు లీకులు జరగకుండా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్టింగ్ చేయనని తప్పుకుంటే బిగ్ బాస్ షోనే ఇబ్బందుల్లో పడుతుంది.

బిగ్ బాస్ నిర్వాహకులు లీకులు జరగకుండా తీసుకునే చర్యలు సక్సెస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube