పుష్ప2 మూవీ టీజర్ విషయంలో నెగిటివ్ కామెంట్ల వెనుక అసలు కారణాలివేనా?

తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) కూడా ఒకటి.ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

 Pushpa 2 Teaser Disappoints With No Dailouge, Pushpa 2, Dailouge, Teaser, Tollyw-TeluguStop.com

పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు.దానికి తోడు పుష్ప 2 సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను కాస్త మరింత పెంచేసింది.

Telugu Allu Arjun, Dailouge, Pushpa, Pushpateaser, Teaser, Tollywood-Movie

తాజాగా రిలీజైన టీజర్లో జాతర సెటప్‌లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి.గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్( Allu Arjun ) లుక్.తన మేనరిజమ్స్, యాక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి.

ఫ్యాన్స్ కి ఈ టీజర్ పూనకాలు తెప్పించింది.ఈ టీజర్ ని చూసిన ప్రేక్షకులు అభిమానులు థియేటర్లో ఈ సీజన్ దద్దరిల్లిపోవడం, అభిమానులకు పూనకాల తెప్పించడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విజువల్‌గా టీజర్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు.అలా అని టీజర్ పట్ల పూర్తి సంతృప్తి కూడా వ్యక్తం కావట్లేదు.

సోషల్ మీడియా జనాల నుంచి పుష్ప-2 టీజర్( Pushpa-2 Teaser ) విషయంలో నిట్టూర్పులు కనిపించాయి.

Telugu Allu Arjun, Dailouge, Pushpa, Pushpateaser, Teaser, Tollywood-Movie

ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ( Devishri Prasad ) బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.పుష్ప థీమ్‌ను వాడుకుని ఏదో మొక్కుబడిగా బ్యాగ్రౌండ్ స్కోర్ లాగించేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించే సౌండ్స్ ఏమీ లేవని ఆర్ఆర్ ఇంకా బెటర్‌గా ఉండాల్సిందని అంటున్నారు.

ఇక టీజర్ విషయంలో మరో విమర్శ ఏంటంటే.చిన్న డైలాగ్ కూడా లేకుండా ఒకే సెటప్‌లో కొన్ని విజువల్స్ తీసి వదిలేయడం.

దీంతో పోలిస్తే గత ఏడాది రిలీజ్ చేసిన గ్లింప్స్ క్యూరియాసిటీ పెంచిందని అందులో పుష్ప ఎక్కడ ఎక్కడ అని అందరూ ఉత్కంఠతో అడగడం చివరికి పుష్ప-పులి డైలాగ్‌తో ముగించడం ఆసక్తికరంగా అనిపించింది.కానీ టీజర్లో చిన్న డైలాగ్ కూడా లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తమవుతోంది.

కొసమెరుపులా చిన్న డైలాగ్ అయినా పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ మెజారిటీ ప్రేక్షకుల్లో కలిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube