మామూలుగా అయితే గర్బవతి అని తెలిసిన వెంటనే మన వద్ద చాలా హంగామా ఉంటుంది.అయితే అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాల్లో మాత్రం అలాంటిది ఏమీ ఉండదు.
అయితే ఎక్కడైనా కూడా గర్బవతి అని తెలిసిన కొన్ని నెలల తర్వాత ప్రసవం జరుగుతుంది.గర్బవతి అయిన చోట ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం, అంతా కూడా చాలా మంచి ఆహారం తీసుకోవడం చేస్తారు.
అయితే స్కాట్‌లాండ్‌లోని ఎమ్మలూయిజ్ లెగ్గాటే అనే అమ్మాయి గర్బవతి అని తెలియకుండానే డెలవరీ అయ్యింది.

ఈ సంఘటన కొన్ని నెలల క్రితం జరిగినా ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది.ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది.18 ఏళ్ల ఎమ్మలూయిజ్ లెగ్గాట్టే తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి అమ్మమ్మతో స్కాట్‌లాండ్‌లోని గ్లాస్లోవ్‌లో నివాసం ఉంటుంది.ఆమె ఒక రోజు ఉదయం లేవడంతోనే ఆమె పొట్ట చాలా ఉబ్బుగా ఉండటంతో పాటు, కడుపులో ఏదో ఉన్నట్లుగా అనిపించింది.రాత్రి పడుకునే వరకు కూడా చాలా నార్మల్‌గా ఉన్న కడుపు అప్పటికే 9 నెలల గర్బవతి అన్నట్లుగా మారింది.
ఎమ్మలూయిజ్ అమ్మమ్మ మనవరాలిని చూసి గర్బవతి అనే నిర్ధారణకు వచ్చింది.
వెంటనే ఎమ్మలూయిజ్‌ను కారులో హాస్పిటల్‌కు తీసుకు వెళ్లింది.
ఎమ్మలూయిజ్‌ను లోనికి పంపించి కారు పార్కింగ్ చేసేందుకు ఆ బామ్మ వెళ్లింది.పార్కింగ్ ఏరియా నుండి హాస్పిటల్‌కు వెళ్లేప్పటికి ఎమ్మలూయిజ్ పండంటి పాపాయికి జన్మనిచ్చింది.
కారు పార్కింగ్ చేసి వచ్చేప్పటికి పాప పుట్టడంతో ఆ బామ్మ అవాక్కయ్యింది.అయితే అప్పటికే 9 నెలలు అవ్వడం వల్ల నార్మల్ డెలవరీ అయ్యిందని వైధ్యులు అన్నారు.

కడుపులో ఉన్న పిండం సైడ్‌కు ఉండటం వల్ల పొట్ట పెద్దగా అనిపించలేదని, ఆమెకు నెలసరి కూడా రాక 8 నెలలు అయ్యిందని వైధ్యులు అన్నారు.8 నెలలుగా నెలసరి రాకపోయినా ఎమ్మలూయిజ్‌కు అనుమనాం రాలేదు.ఎందుకంటే ఆమె అనారోగ్య కారణంగా కొన్ని మందులు వాడుతుంది.ఆ మందుల కారణంగా నెలసరి సరిగా రావడం లేదని ఆమె భావించింది.ఈ మొత్తం వ్యవహారం స్థానికంగా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.







