వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక( Warangal – Khammam – Nalgonda MLC By-Election ) ప్రచారం ముగియనుంది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెర దించనున్నారు.
సాయంత్రం 4 గంటల తరువాత మైకులు బంద్ కానున్నాయి.కాగా ఈ నెల 27వ తేదీన వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను( 600 Polling Centres ) అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తుండగా.మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది.మరోవైపు ఈ నెల 27న ఓటు వేసే వారందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.