ముగియనున్న వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం

వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక( Warangal – Khammam – Nalgonda MLC By-Election ) ప్రచారం ముగియనుంది.

ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెర దించనున్నారు.సాయంత్రం 4 గంటల తరువాత మైకులు బంద్ కానున్నాయి.

కాగా ఈ నెల 27వ తేదీన వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను( 600 Polling Centres ) అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తుండగా.మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది.

మరోవైపు ఈ నెల 27న ఓటు వేసే వారందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

మందారం తో మెరిసే చర్మం మీ సొంతం అవ్వాలంటే ఇలా చేయండి!