Priyanka Jain Amar Deep : షూటింగ్ సెట్లో గొడవపడిన రామా జానకి... వైరల్ అవుతున్న వీడియో!

Rama Janaki, Who Had A Fight On The Shooting SetThe Video Is Going Viral , Rama Janaki ,Priyanka Jain ,janaki Kanaganaledu Serial , Amar Deep,Mallika,

బుల్లితెరపై ప్రసారమైన మౌనరాగం సీరియల్ ద్వారా మూగమ్మాయి అమ్ములు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కన్నడ నటి ప్రియాంక జైన్.ఈమె ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో నటిస్తూ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు.

 Rama Janaki, Who Had A Fight On The Shooting Setthe Video Is Going Viral , Rama-TeluguStop.com

ఇక ఈ సీరియల్ లో రామ పాత్రలో నటిస్తున్న అమర్ దీప్, జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంకకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకవైపు సీరియల్లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రియాంక సైతం నెవర్ ఎండ్ టైల్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు.ఇక నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే తాజాగా ఈమె జానకి కలగనలేదు సీరియల్ షూటింగ్ సమయంలో ఉన్నఫలంగా అమర్ దీప్ తో గొడవకు దిగారు.షూటింగ్ లొకేషన్లో అందరి ముందు ఇలా అయితే నటించడం కుదరదు అంటూ జానకి ప్లాన్ ప్రకారమే రామతో గొడవ పడింది.

ఇలా వీరిద్దరి మధ్య గొడవతారా స్థాయికి చేరుకుంది అయితే పక్కనే ఉన్నటువంటి మల్లికా రామాను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీరిద్దరి మధ్య గొడవ పెద్ద ఎత్తున జరిగింది.అయితే టీం మెంబెర్స్ అందరు కూడా ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందోనని మౌనంగా చూస్తూ ఉండిపోయారు.అయితే ఇలా బాగా గొడవ పడిన ప్రియాంక అనంతరం ఇది ఫ్రాంక్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ఇదేం ఫ్రాంక్ అండి నిజంగా ఏం జరిగిపోతుందోనని భయపడ్డాము అంటూ అక్కడున్న వారందరూ కూడా అది ఫ్రాంక్ అని తెలిసినప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు తీరుకోలేకపోయారు.

మొత్తానికి జానకి ఫ్రాంక్ వీడియో ద్వారా ఒక్కసారిగా రామాను బాగా భయపెట్టిందని చెప్పాలి.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube