Balakrishna Veerasimha Reddy: వీరసింహారెడ్డి నిజంగా అక్కడ అంత రేటు పలికిందా?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.హీరోయిన్‌ గా ఈ సినిమా లో శృతి హాసన్ నటిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

 Balakrishna Veerasimha Reddy Movie Pre Release Business Details, Balakrishna, Ch-TeluguStop.com

ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఈ సంక్రాంతికి సినిమా ను విడుదల చేసేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో మెగా స్టార్‌ చిరంజీవి వస్తున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యం లో నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యం లో బిజినెస్ ఎలా జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

తెలుగు రాష్ట్రాల్లో కాస్త అటు ఇటుగా వాల్తేరు వీరయ్య సినిమా కు ఏమాత్రం తగ్గకుండా వీర సింహా రెడ్డి బిజినెస్ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో బాలయ్య యొక్క వీర సింహారెడ్డి యూఎస్ లో ఏకంగా 6 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి.వాల్తేరు వీరయ్య సినిమా కు ఓవర్సీస్ లో 8.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సమయంలోనే వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.తప్పకుండా ఇదో విభిన్నమైన మాస్‌ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.

Telugu Balakrishna, Chiranjeevi, Telugu, Tollywood, Veerasimhareddy-Movie

అందుకే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసిన నేపథ్యం లో భారీ ఎత్తున అఖండ వసూళ్లు నమోదు అయిన కారణంగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్‌ అదే స్థాయిలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.అతి త్వరలోనే వీర సింహ రెడ్డి సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వబోతున్నాయి.డిసెంబర్‌ లోనే సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు షురు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా హిట్ అయితే బాలయ్య మరింత స్పీడ్ గా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube